Jahnvi Kapoor : రన్వీర్ న్యూడ్ ఫోటో షూట్‌పై జాన్వీ కపూర్ ఏమందంటే..?

Jahnvi Kapoor : రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ కాంట్రవర్సీ ఇంకా హాట్ డిబేట్‌గానే కొనసాగుతోంది

Update: 2022-07-30 12:30 GMT

Jahnvi Kapoor : రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ కాంట్రవర్సీ ఇంకా హాట్ డిబేట్‌గానే కొనసాగుతోంది. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఈ వివాదంపై స్పందించారు. న్యూడ్ ఫోటోషూట్ అనేది ఒక కళాత్మక స్వేచ్ఛకు సంబంధించినది. అలాంటి ఓ కళ గురించి నెగటివ్‌గా ప్రచారం చేయడం, మంచిదికాదని చెప్పడం సరైంది కాదన్నారు. రన్వీర్‌ సింగ్‌ను తాను సపోర్టు చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని రిలయన్స్ డిజిటల్ షోరూంను జాన్వీ కపూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు.

రన్వీర్ సింగ్ ఈ మధ్య పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేశారు. పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగానే ఫోటో షూట్ చేసినట్లు రన్వీర్ చెప్పుకొచ్చారు. మహిళల మనోభావాలు దెబ్బతీశారంటూ రన్వీర్‌ సింగ్ పై ముంబైలో కేసు కూడా నమోదైంది. 

Tags:    

Similar News