టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. షూటింగ్ కూడా మొదలయ్యింది. తాజాగా, ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ (Jai Hanuman)నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఒక కోతి తన దగ్గరకు వచ్చిన పిక్ షేర్ చేస్తూ.. ‘‘మేము మళ్లీ కలిశాము ఇదే సంకేతం’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అలాగే దీపావళికి ‘జై మనుమాన్’ అప్డేట్ రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా ‘జై హనుమాన్’ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.