జన నాయకుడు మూవీ విడుదలకు మరో రెండు రోజులే టైమ్ ఉంది. ఈ టైమ్ లో సెన్సార్ ఇష్యూస్ రావడం సమస్యగా మారింది. మామూలుగా అయితే ఇలాంటి మూవీస్ రిలీజ్ అవుతాయి. బట్అతను పొలిటికల్ అవతారం ఎత్తబోతున్నాడు కాబట్టి ఆ విషయంలో సమస్యలు వస్తుండటం మాత్రం కామన్ అనేది చాలామంది చెబుతోన్న విషయం. దళపతి విజయ్ లాస్ట్ మూవీగా మారింది ఇది. భగవంత్ కేసరికి రీమేక్ లా కనిపిస్తోంది. అయితే చాలా మార్పులు చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చివరి నిమిషంలో మాత్రం సెన్సార్ ఇబ్బందులు పెరగడం సమస్యగా మారింది.
జన నాయగన్ మూవీకి సంబంధించి సెన్సార్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ చిత్రం మతపరమైన సమస్యలు లేవనెత్తబోతోంది అంటూ. అదే విషయాన్ని కోర్ట్ కు తెలియజేశారు. కోర్ట్ నుంచి అఫీషియల్ గా కంప్లైంట్ తీసుకుంది. దీంతో రేపు విచారణ జరుగుతోందన్నమాట. ఈ లోగా ప్రీమియర్స్ విషయంలో ఇబ్బందులు పడబోతున్నాయి అనిపిస్తున్నాయి. అయితే అది ఏ మతానికి సంబంధించిన సమస్యలు అంటే మాత్రం యూఏఇ కంట్రీ నుంచి వస్తాయట సమస్యలు అనిపించారు. ఆ మేరకు ఆల్రెడీ ఆ దేశాల్లో బ్యాన్ చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జన నాయగన్ కు అంత ఈజీగా సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాదు. ఒవకేళ చివరి నిమిషంలో కాబట్టి సెన్సార్ చెప్పే మాటలకు ఓకే చెప్పి ఆయా సన్నివేశాలు కట్ చేయడం మాత్రమే సమస్యకు పరిష్కారం.