వెరైటీ స్టోరీస్ తో, విలక్షణమైన పాత్రలతో మెప్పించే యంగ్ హీరో సుహాస్. లేటెస్ట్ గా అతడు నటించిన చిత్రం ‘జనక అయితే గనక’. ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఒక సమస్యపై ఈ సినిమా తెరకెక్కింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం.. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంది.
సంకీర్తన హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జనక అయితే గనక మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రం ప్రధానంగా పిల్లలు కనడానికి భయపడే ఒక వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా తీసుకుంటుంది. ఆధునిక జీవనంలో పెరుగుతున్న ఆర్థిక భారం, సామాజిక ఒత్తిళ్లు, భవిష్యత్తు గురించిన ఆందోళన వంటి కారణాల వల్ల పిల్లలను కనడానికి భయపడే యువతీయువకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ కథ తెరకెక్కింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా సుహాస్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.