Pawan Kalyan: సతీసమేతంగా పవన్ కళ్యాణ్... ఆయన లెక్కకో కిక్కుంది..!
ప్రత్యర్థులకు తన చేతల ద్వారా చెమటలు పట్టించిన జనసేనాని;
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ విషయమైనా సంచలనమే. తన సినీ కెరీర్ నుంచి తాజా రాజకీయాలదాకా ప్రతీది విలక్షణమే. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో తొలిదశ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో సతీ సమేతంగా పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, అనా కొనిదెల దంపతులు శాస్త్రోక్తంగా దార్మిక విధులను నిర్వర్తించారు. కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రేపు మంగళగిరికి చేరుకుని కార్యకర్తలను కలువనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి ప్రత్యర్థి పార్టీలు నానా రచ్చ చేశాయి. పవన్ మరో సారి విడాకులు ఇవ్వనున్నట్లు ప్రచారం చేశాయి. ఇందుకుగాను జాతీయ మీడియాను సైతం తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ఈ విమర్శలకు ధీటుగా పవన్ సమాదానం చెప్పారు. ఏకంగా సతీసమేతంగా ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించి విమర్శకుల నోళ్లు మూయించారు. పవన్ ఏం చేసినా దానికో లెక్క, కిక్కు ఉంటుందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఒకరకంగా కుక్కకాటుకు చెప్పదెబ్బలాగ పవన్ తన ప్రత్యర్థులకు బుద్ది చెప్పినట్లు అనుకుంటున్నారు.