Janhvi Kapoor : ఎరుపు రంగు చీరలో మతిపోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ
జాన్వీకపూర్ హాట్ ఫొటోషూట్.. ఏంజెల్‌లా ఉన్నావంటున్న నెటిజన్లు;
ఇటీవలి కాలంలో సెలబ్రెటీలు ట్రెండింగ్ లో ఉండాలంటే ఎంచుకునే మార్గాల్లో ఒకటి ఫొటోషూట్. పలు ఫొటోషూట్స్ తో కుర్రకారుల హృదయాలు కొల్లగొడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడం రీసెంట్ డేస్ లో కామన్ అయిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఫొటోషూట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన జాన్వీ కపూర్.. మొదటి సినిమానే హిట్ అవ్వడంతో ఇప్పుడు పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఆమె ఇది ఆర్ట్ పనితనం అనే క్యాప్షన్ ను కూడా రాసుకువచ్చింది. ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు.. ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏంజెల్‌లా ఉన్నావని, రవివర్మకే సాధ్యం కాని అందం నీది అని పొగుడుతున్నారు. అతిలోక సుందరిని మించిపోతున్నావని చెబుతున్నారు. హాట్ బ్యూటీ కిర్రాక్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫొటోల్లో జాన్వీ.. భారతీయ యువరాణిలా కనిపించినప్పటికీ, ఆమె తన రూపానికి కాస్త ఆధునికతను జోడించింది. ఆమె బ్లౌజ్ లేని డ్యూయల్ టోన్ చీరను అప్రయత్నంగా తన శరీరానికి చుట్టుకుంది. పొడవాటి ఉంగరాల జుట్టు, గులాబీ పువ్వులను తల అలంకరణగా ఎంచుకుంది. ఆమె శైలి, ఆకర్షణ ఒక ఆధ్యాత్మిక పోర్ట్రెయిట్‌తో సరిపోలింది. ఇక మేకప్ విషయానికొస్తే, దివా నిగనిగలాడే పీచ్-టోన్ లుక్‌తో ఆకర్షిస్తోంది. పెదవులకు కొద్దిగా గులాబీ రంగు, కళ్లకు గులాబీ రంగు ఐషాడోతో హైలైట్ చేసింది.
ఇక జాన్వీ ధరించిన ఈ చీర విషయానికొస్తే.. ఇది రూ. 24,500కు మార్కెట్లో అందుబాటులో ఉంది. గులాల్ జరీ బోర్డర్ లినెన్ చీరగా పిలవబడే ఈ డ్రేప్ సిల్వర్ జరీ బార్డర్‌లతో చేతితో నేసిన నార బట్టతో తయారు చేయబడింది. ఇకపోతే జాన్వి.. రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'లో నటించనుంది.