Jana Gana Mana : 'జనగణమన'లో బాలీవుడ్ హాట్ బ్యూటీ..!
Jana Gana Mana : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండో మూవీ 'జనగణమన'.;
Janhvi Kapoor: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండో మూవీ 'జనగణమన'.. దీనికి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని చార్మీ, దర్శకుడు వంశీ పైడిపల్లి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తరన్న చర్చ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పూరీ ఆమెను సంప్రదించారని సమాచారం. దీనిపైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. కాగా ఈ సినిమాలో సైనికుడిగా కనిపించనున్నాడు విజయ్.. ఈ సినిమాని ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లుగా పూరీ అనౌన్స్ కూడా చేశాడు. అటు పూరీ, విజయ్ కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీగా లైగర్ రానుంది.