గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘పెద్ది’. మైత్రీ మూవీస్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ గ్లోబ్ మొత్తాన్ని ఊపేసింది. ఐపిఎల్ క్రికెటర్స్ కూడా ఈ గ్లింప్స్ ను రీ క్రియేట్ చేశారు. రామ్ చరణ్ నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడనే టాక్ బలంగా ఉంది. ఈ మూవీతో చరణ్ చాలా రికార్డులు బ్రేక్ చేయబోతున్నాడని.. బుచ్చిబాబు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళతాడు అనేవాళ్లూ ఉన్నారు.
ఈ మధ్య రామ్ చరణ్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. లండన్ టుస్సాడ్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఈ నెల 9న ఆవిష్కరించారు. అందుకోసం కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. అలాగే లండన్ లోనే రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ ఆదివారం జరిగిన ఆర్ఆర్ఆర్ గ్రాండ్ మ్యూజికల్ సెలబ్రేషన్ లోనూ పాల్గొన్నాడు. సో.. అక్కడి నుంచి రాగానే ఈ నెల 15 నుంచి పెద్ది మూవీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు ఫస్ట్ టైమ్ జాన్వీ కపూర్ కూడా జాయిన్ కాబోతోంది. ఈ ఇద్దరి మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తిగా హైదరాబాద్ లోనే ప్లాన చేశాడు బుచ్చిబాబు. మొత్తంగా రామ్ చరణ్, జాన్వీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందో ముందుగా లొకేషన్ లో ఉన్నవారికి అర్థం కాబోతోందన్నమాట.