Janhvi Kapoor : మరో టాప్ హీరోతో జాన్వీ

Update: 2025-02-18 04:30 GMT

కొన్నాళ్ల క్రితం.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను సౌత్ కు ఎవరు పరిచయం చేస్తారా..? ఏ కథతో ఇంటర్డ్యూస్ అవుతుందా అని చర్చించుకునేవారు. సడెన్ గా ఎన్టీఆర్ సరసన దేవరతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఏం లేదు. అయినా రెండు పాటల్లో ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమా చేస్తోంది. దీంతో పాటు కోలీవుడ్ లో కూడా పా. రంజిత్ డైరెక్షన్ లో నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి.అయితే ఎలా చూసినా సౌత్ లో.. ఆ మాటకొస్తే ఇప్పుడు ఇండియాలోనే పెద్ద పరిశ్రమ అంటే అంతా టాలీవుడ్ వైపే చూస్తున్నారు.అందుకే అమ్మడు ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది.అందులో భాగంగానే మరో టాప్ హీరో సరసన ఆఫర్ కొట్టేసిందంటున్నారు.

పుష్ప 2తో కంట్రీ మొత్తం కలెక్షన్స్ తో షేక్ చేసిన అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 తర్వాత ఐకన్ స్టార్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. కానీ సడెన్ గా మధ్యలోకి తమిళ్ డైరెక్టర్ అట్లీ ఎంట్రీ ఇచ్చాడు. అట్లీ ఎప్పటి నుంచో అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ మధ్య ఓ కథ చెప్పాడు. హీరోకు నచ్చలేదు. ఫైనల్ గా ఈ నెలలోనే మరో స్టోరీతో వచ్చి ఒప్పించాడు. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను కూడా పక్కనపెట్టి అట్లీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీలోనే జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఆల్రెడీ జాన్వీ కూడా ఓకే చెప్పిందంటున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం చేస్తున్నాడు అని ప్రకటించారు. త్వరలోనే జాన్వీ కపూర్ విషయం కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. మొత్తానికి జాన్వీ తెలుగులో టాప్ హీరోలతోనే మూవ్ అవుతోందని చెప్పాలి. ఆ మధ్య నానికి నో చెప్పింది. ఇప్పుడు అల్లు అర్జున్ కు ఎస్ చెప్పబోతోంది. అంటే అర్థం అదే కదా..?

Tags:    

Similar News