Jani Master : జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్

Update: 2024-10-03 16:00 GMT

మహిళా కొరియోగ్రాఫర్‌‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు అందుకోవడానికి ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే జానీ మాస్టర్ పోలీసు కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను, బాధితులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. కాగా తాను ఓ జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉందని, ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించాల్సి ఉన్నందున 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పరిశీలించి కోర్టు బెయిల్ ఇచ్చింది.

Tags:    

Similar News