కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఆమెతో పాటు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో వీరు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆగస్టు 14, 2025న తమ కొత్త చిత్రం 'పరమ్ సుందరి' విడుదల కానున్న నేపథ్యంలో వీరు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 13న తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శిస్తారు. ఈసారి ఆమెతో కలిసి నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా దర్శనానికి వచ్చారు. ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒక వీడియోలో మాట్లాడుతూ, "మేము తిరుపతి వైపు వెళ్తున్నాం" అని అన్నారు. దీనికి జాన్వీ కపూర్ నవ్వుతూ "తిరుమల, తిరుపతి కాదు" అని సరిదిద్దారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుమలకు రావడం ఇదే తొలిసారి అని సిద్ధార్థ్ మల్హోత్రా తెలిపారు. తమ సినిమా విజయం సాధించాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.