సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘జటాధర’. సోనాక్షిసిన్హా ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు అని ఇప్పటి వరకూ చాలామంది అనుకున్నారు. బట్ ఈ ఇద్దరూ శతృవులు అని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. ఓరకంగా సోనాక్షి సిన్హా నెగెటివ్ రోల్ చేస్తోంది. ఆమెను ఎదురించే జటాధరుడుగా సుధీర్ కనిపించబోతున్నాడు.. అనేది ఈ టీజర్ తో చెప్పారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైశ్వాల్ ద్వయం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.
దురాశ చేత సృష్టించబడిని చీకటి ఆమె.. త్యాగం నుంచి పుట్టినవాడు అతను.. ఈ ఇద్దరి మధ్య సాగే యుద్ధానికి సాక్షులుగా నిలవండి.. త్యాగం వర్సెస్ దురాశ, సైతాన్ వర్సెస్ మనిషి అంటూ టెక్ట్స్ లైన్స్ తో సాగిన టీజర్ ఇంట్రెస్టింగ్ అయితే లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పూర్తిగా తేలిపోయాయి. చాలా నాసిరకంగా కనిపిస్తున్నాయి గ్రాఫిక్స్.
అయితే సోనాక్షి మాత్రం ఈ మూవీతో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది అనేలా ఉంది. సుధీర్ బాబుకూ కొత్త పాత్రగా ఉంటుంది. మరి ఈ ఇద్దరి మధ్యే యుద్ధం అంటే ప్రత్యేకంగా మరో హీరోయిన్ ఉంటుందా లేక ఈ దెయ్యం, మనిషి కథే కనిపిస్తుందా అనేది చూడాలి.