'భాగ్ సాలే'కు జొన్నలగడ్డ సిద్దు వాయిస్ ఓవర్

జులై 7న సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది.;

Update: 2023-06-21 10:00 GMT

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా భాగ్ సాలే. ఇందులో నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేను ప్రేక్షకులకు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పరిచయం చేయబోతున్నారు. ఆయన వాయిస్ ఓవర్ తో భాగ్ సాలే చిత్ర నేపథ్యాన్ని వివరించబోతున్నారు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడు, దాని వెనకున్న కారణాలు సిద్ధు వాయిస్ లో ఆసక్తికరంగా ఉండనున్నాయి. భాగ్ సాలే ప్రపంచం ఎలా ఉండనుంది అనేది జూలై 7న థియేటర్స్ లో చూడాలని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి పలువురు నటించారు.


Tags:    

Similar News