RRR - NTR : RRR హవా ... NTRకి విగ్రహం.. ఆ పై పాలాభిషేకం..!
RRR - NTR : తెలుగు రాష్ట్రల్లో RRR హవా మొదలైంది.. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద తమ అభిమాన హీరోలకి భారీ కటౌట్లు ఏర్పాటు చేసి రచ్చ చేస్తున్నారు.;
RRR - NTR : తెలుగు రాష్ట్రల్లో RRR హవా మొదలైంది.. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద తమ అభిమాన హీరోలకి భారీ కటౌట్లు ఏర్పాటు చేసి రచ్చ చేస్తున్నారు. క్రాకర్స్ పేల్చడం, థియేటర్లలో డ్యాన్స్ చేయడం వంటి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా ఆయనకి ఓ విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కొమరం భీమ్ గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం చేశారు. అయితే ఇది ఎక్కడ అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది.
He is in Different League when it comes to masses💥💥@tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/TO19eb4gbP
— KICK Tollywood ᵀʰᵒᵏᵏᵘᵏᵘⁿᵗᵘᵖᵒᵛᵃᵃˡᵉ 🌊 (@KickTwood) March 24, 2022
కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ త్రిబుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, అల్లూరి సీతరామరాజుగా చరణ్ నటించి మెప్పించారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.