Jr NTR Emotional : పునీత్‌ను తలుచుకొని ఎన్టీఆర్ ఎమోషనల్.. అంతా జీరోలా అనిపిస్తోందని..!
Jr NTR Emotional : దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లేని కర్ణాటక తనకి శూన్యంలాగా కనిపిస్తోందని అన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్..;
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లేని కర్ణాటక తనకి శూన్యంలాగా కనిపిస్తోందని అన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. RRR మూవీ ప్రమోషన్‌లో భాగంగా బెంగుళూరు వెళ్ళిన ఎన్టీఆర్.. అక్కడ విలేకరుల సమావేశంలో పునీత్ గురించి మాట్లాడుతూ భాగోద్వేగానికి లోనయ్యారు. పునీత్ లేని లోటును ఎవరు కూడా భర్తీ చేయలేరని అన్నారు. వేరే బాష నటులు కూడా పునీత్‌ని మిస్ అవుతున్నారని తెలిపాడు.
పునీత్ ఎక్కడున్నా నాపై ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉంటాయని తెలిపాడు. ఈ సందర్భంగా గెలీయా గెలీయా పాట పాడి పునీత్‌కి నివాళులు అర్పించారు ఎన్టీఆర్. పునీత్ రాజ్‌కుమార్ చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఈ పాట పాడగా, తమన్ మ్యూజిక్ అందించాడు. ఇక పునీత్ రాజ్‌కుమార్ అక్టోబరు 29న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు హాజరయ్యారు.