Kaithapram Vishwanathan Nambudiri: మాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇక లేరు..
Kaithapram Vishwanathan Nambudiri: 58 ఏళ్ల విశ్వనాథం.. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.;
Kaithapram Vishwanathan Nambudiri: ఇప్పటికే సినీ పరిశ్రమ రెండేళ్ల సమయంలో ఎందరో నటీనటులను, దర్శక నిర్మాతలను, సింగర్స్, డ్యాన్సర్స్‌ను పోగొట్టుకుంది. తాజాగా మరో టాలెంటర్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కూడా సినీ పరిశ్రమ పోగొట్టుకుంది. ఆయనే మాలీవుడ్‌కు చెందిన కైతప్రం విశ్వనాథం నంబూతిరి.
ప్రముఖ రచయిత కైతప్రం దామోదరన్ నంబూతిరి తమ్ముడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కైతప్రం విశ్వనాథం నంబూతిరి మలయాళంలో 25కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. జయరాజ్ దర్శకత్వం వహించిన 'తిలకం' చిత్రంలోని 'సైరే సిరే సంభారే' పాట ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
58 ఏళ్ల విశ్వనాథం.. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దానికోసమే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మతికి పలువురు మాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు.