నిన్నటి టాలీవుడ్ టాప్ హీరోయిన్.. కోలీవుడ్ లోనూ టాప్ లేపిన బ్యూటీ కాజల్ అగర్వాల్ దర్శకత్వం చేయబోతోందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పైగా తనే ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మరీ ఆ బ్యానర్ లోనే ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయబోతోందంటున్నారు. మరి ఈ వార్త కాజల్ కు అయినా తెలుసో లేదో కానీ.. న్యూస్ మాత్రం వైరల్ గా మారింది. నిజానికి హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా కాజల్ ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కాకపోతే పెళ్లి, పిల్లాడు తర్వాత ఆఫర్స్ తగ్గాయి. ఇది ఎవరికైనా కామన్. అయినా తనకు సత్యభామ లాంటి సోలో మూవీ పడింది. కాకపోతే ఆ సినిమా ఆకట్టుకోలేదు. దీంతో మరో ఆఫర్ రాలేదు. వచ్చినవి కూడా ఆగిపోతున్నాయి అని చెబుతున్నారు. ఈ టైమ్ లో నటిగానే ఇంకేదైనా కొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇస్తుంటారు మాజీ హీరోయిన్లు. మరి కాజల్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే డౌట్స్ కూడా ఈ రూమర్ తో పాటే వ్యాపిస్తున్నాయి.
కాజల్ హీరోయిన్ గా బాగానే సంపాదించింది. తన భర్త గౌతమ్ కూడా రిచ్ మేన్. సో.. ఇద్దరూ కలిసి ప్రొడక్షన్ హౌస్ స్థాపించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఇలా డైరెక్షన్ అంటేనే ఆశ్చర్యంతో పాటు అవసరమా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికైతే ఇది జస్ట్ రూమర్ మాత్రమే. నిజం అవుతుంది అనుకోలేం. ఒకవేళ నిజమే అయితే మాత్రం కాజల్ ఆడియన్స్ నే కాదు.. ఇండస్ట్రీస్ ను సైతం ఆశ్చర్యపరిచినట్టే అని చెప్పాలి.