Kamal Haasan : కమల్ హాసన్ @70

Update: 2024-11-08 06:00 GMT

భారతదేశ ప్రముఖ నటుడు, దక్షిణ భారత్ సినిమాలు, ఎక్కువగా తమిళ్ మూవీస్ లో నటించి పేరు తెచ్చుకున్నస్టార్ నటుడు కమల్ హాసన్. బాలనటుడిగా సినిమాల్లోకి వచ్చి నటించిన మొదటి మూవీకే జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. 1954 తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు శ్రీనివా సన్, రాజ్యలక్ష్మీ. ఈయన నాలుగో సంతానం. కమల్ హాసన్ మూ డున్నారేళ్ల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన మొదటి చిత్రం 'కలత్తూర్ కన్నమ్మ'. అనంతరం పలు శాస్త్రీయ కళల్లో ప్రావీణ్యం సంపాదించారు. తర్వాత ఎన్నో మూవీస్ లో నటించి చిత్ర పరిశ్రమ తిరుగులేని నటుడిగా ఎదిగారు. 1981 నుంచి రాజ్ కమల్ బ్యానర్ పై నిర్మాతగా మారారు. ఆయన చేసిన మొదటి చిత్రం రాజ పార్వై. ఆతర్వాత ఎన్నో హిట్ చిత్రాలను తన బ్యానర్ పై నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హాసన్ మూడుసార్లు గెలుచుకున్నారు. సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలకు ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి పురస్కారం సొంతం చేసుకున్నారు. 18 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. 1990లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో, 2014లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. మూడు దశాబ్దాల నటజీవితంలో 171కి పైగా అవార్డులను గెలుచుకున్నారు. సినిరం గానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం ఆయనను కళైమామణి (కళాకారుల్లో మాణిక్యం) అనే బిరుదుతో సత్కరించింది. కమల్ హాసన్ వాణి గణపతి అనే మహిళను వి వాహమాడారు. తర్వాత సారిక అనే మహిళను పెళ్లిచేసుకున్నారు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు పుట్టారు. సారిక నుంచి విడిపోయిన తర్వాత కమల్ హాసన్ తెలుగు నటి గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. ఇక కమల్ హాసన్ సినిమాల విష యానికి వస్తే ప్రస్తుతం ఆయన థగ్ లైఫ్ అనే మూవీని చేస్తున్నా రు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రాజ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News