Kamal Haasan : థగ్ లైఫ్ ట్రైలర్ వస్తోంది

Update: 2025-05-16 09:30 GMT

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయింది. దాదాపు 35యేళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు మరో కారణం కూడా ఉంది. ఈ చిత్రంలో కమల్ తో పాటు శింబు, త్రిష కూడా ఉన్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. థగ్ లైఫ్ లో కమల్ హాసన్ ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ను చేయబోతున్నాడు. అతను ‘రంగరాయ శక్తివేల్ నాయకర్’అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మణిరత్నం, కమల్ కాంబోలో వచ్చిన నాయకుడు అనే చిత్రం కూడా వరదరాజన్ ముదలియార్ అనే పేరు మోసిన గ్యాంగ్ స్టర్ పాత్ర ఆధారంగానే రూపొందింది. నాయకుడు అన్ని భాషల్లోనూ అఖండ విజయం సాధించింది. ఈ సారి కూడా రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కమల్ కనిపించబోతున్నాడు.

విక్రమ్ వంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ చేస్తోన్న మూవీ ఇది. ఆల్రెడీ నిర్మాతగా గతేడాది అమరన్ తో మరో అద్భుత విజయం అందుకున్నాడు. మరి ఈ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ థగ్ లైఫ్ జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్. ఇక ట్రైలర్ ను ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు.

తెలుగులో థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ సారి వైజాగ్ లో నిర్వహించబోతున్నారని టాక్. మామూలుగా తమిళ్ మూవీ టీమ్ వాళ్లంతా హైదరాబాద్ వరకూ పరిమితమవుతారు. బట్ కమల్ వైజాగ్ ను ఎంచుకున్నాడు. అలాగే హైదరాబాద్ లో కూడా ఓ ఈవెంట్ నిర్వహిస్తారట. 

Tags:    

Similar News