Kamna Jethmalani : ఎలాంటి పాత్రకైనా రెడీ... రీఎంట్రీ ఇస్తున్న కామ్నా జెఠ్మలనీ
Kamna Jethmalani : ప్రేమికులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ కామ్నా జెఠ్మలనీ...;
Kamna Jethmalani : ప్రేమికులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ కామ్నా జెఠ్మలనీ... రణం, బెండు అప్పారావ్, కత్తి కాంతారావు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరమైన అమ్మడు.. 2014లో బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.
ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటుంది ఈ భామ.. స్టోరీ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించేందుకు సిద్దేమేనని చెబుతుంది. కోలీవుడ్ లో నటించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.
1985 ముంబైలో జన్మించింది కామ్నా జెఠ్మలనీ.. ఆమె తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ బిజినెస్ మెన్.