Kangana Ranaut : నిరూపిస్తే 'పద్మశ్రీ' ఇచ్చేస్తా.. : కంగనా

Kangana Ranaut : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ఎవరేమనుకుంటే నాకేం.. అని తన మనసులోని మాటను బోల్డ్‌గా బయటపెట్టేస్తుంది..

Update: 2021-11-13 09:45 GMT

Kangana Ranaut: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ఎవరేమనుకుంటే నాకేం.. అని తన మనసులోని మాటను బోల్డ్‌గా బయటపెట్టేస్తుంది.. వ్యతిరేకతలు వెల్లువెత్తినా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా దానికి కౌంటర్ వేస్తూ అన్న వాళ్లని కిమ్మనకుండా చేస్తుంది.

బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే టక్కున గుర్తుచ్చే పేరు కంగన. భారతదేశానికి స్వతంత్రం బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అని సంచలన కామెంట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వాటిపై స్పందించింది కంగన.

సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ జీ వంటి మహానుభావుల త్యాగాలతో పాటు 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రతిదీ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాను. 1857 ఫైట్ గురించి నాకు తెలుసు కానీ 1947లో ఎలాంటి యుద్ధం జరిగిందో నాకు తెలియదు.

ఎవరైనా నా దృష్టికి తీసుకువస్తే.. వెంటనే నా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తా.. క్షమాపణలు కూడా చెబుతా.. దయచేసి దీనిపై నాకు వివరణ ఇవ్వండి అంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

అలాగే నేను ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రంలో నటించాను. ఆ సమయంలో 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటం గురించి విస్తృతంగా రీసెర్చ్ చేశా.. ఆ సమయంలో జాతీయవాదం పెరిగింది. అయితే ఆమె ఆకస్మిక మరణం ఎందుకు జరిగింది.. గాంధీజీ, భగత్ సింగ్‌ను ఎందుకు కాపాడలేదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎందుకు చనిపోయాడు.

ఆయనకు గాంధీ ఎందుకు మద్ధతు ఇవ్వలేదు. బ్రిటీషర్లు విభజన రేఖను ఎందుకు గీసారు.. స్వాతంత్ర్యాన్ని వేడుకగా జరుపుకునే బదులు భారతీయులు ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు.. వీటికి సమాధానాలు వెతికేందుకు దయచేసి నాకు సహాయం చేయండి.. అని కంగన తెలిపింది. వీటన్నింటికి జవాబు చెబితే నాకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని తిరిగి ఇచ్చేస్తానని కంగన చెప్పింది. 

Tags:    

Similar News