Kangana Ranaut : 40 కోట్లకు ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టిన కంగన

Update: 2024-08-06 13:30 GMT

బాలీవుడ్ నటి హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యురాలు కంగనా రనౌత్ ముంబైలోని తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఆ భవనం ధర 40 కోట్లని పేర్కొంటోంది. 2020లో ఈ బంగళా వార్తల్లో నిలిచింది. అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఈ బంగ్లాని పాక్షికంగా ధ్వంసం చేసింది. ఇప్పుడా బంగ్లాని కంగనా అమ్మేస్తున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ బంగ్లా వీడియోని యూట్యూబ్లో షేర్ చేసింది. బంగ్లా ఇంటీరియర్ని వీడియో తీసి పోస్ట్ చేసింది. రూ.40 కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఈ బంగ్లాలోనే కంగనా రనౌత్ మణికర్ణిక ఫిల్మ్స్ ఆఫీస్ ఉంది. ఈ ఇంటీరియర్ని ఫేమస్ ఆర్కిటెక్ట్ షబ్నామ్ గుప్తా డిజైన్ చేశారు. ఎడిటింగ్ స్టూడియో, చెక్కతో తయారు చేసిన మెట్లు, విశాలమైన వర్క్ ప్లేస్తో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, డిస్కషన్ రూమ్స్ నీ కట్టారు. రెండో అంతస్తులో మీటింగ్ ఏరియా ఉంది. పర్షియన్ స్టైల్లో నిర్మించినప్పటికీ ఇండియన్ స్టైల్నీ జోడించారు. రాజస్థాన్ నుంచి ఫర్నిచర్ తెప్పించారు. 2020లో కంగనా రనౌత్ తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ బంగ్లా ఇంటీరియర్ ఫొటోలు షేర్ చేసింది. అప్పట్లో ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో 500 స్క్వేర్ ఫీట్స్ పార్కింగ్ ప్లేస్ ఉంది. మొత్తం మూడు అంతస్తుల్లో కళ్లు చెదిరే విధంగా నిర్మించారు. 2020లో మున్సిపల్ అధికారులు ఈ బంగ్లాని పాక్షికంగా ధ్వంసం చేసిన కొద్ది గంటల్లోనే కంగనా రనౌత్ కోర్టుకెక్కారు. ఇప్పుడు అమ్మకానికి పెట్టడం వల్ల మరోసారి ఈ బంగ్లా వార్తల్లో నిలిచింది.

Tags:    

Similar News