Kangana Ranaut: 'సీతారామం'పై కంగన కామెంట్స్..

Kangana Ranaut: ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన కార్తికేయకు, సీతారామంకు బ్రహ్మరథం పట్టారు.;

Update: 2022-09-22 10:35 GMT

Kangana Ranaut: ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన కార్తికేయకు, సీతారామంకు బ్రహ్మరథం పట్టారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ సీతారామంపై కామెంట్ చేసింది. హను రాఘవపూడి రచించి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దుల్కర్ కశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న భారత సైనిక అధికారి లెఫ్టినెంట్ రామ్‌గా కనిపించగా, మృణాల్ సీతామహాలక్ష్మి పాత్ర పోషించింది.  ఆమె నుండి అనామక ప్రేమలేఖలు అందుకుంటాడు రామ్.

ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న కంగన ఖాళీ సమయాన్ని చూసుకుని సీతారామంని వీక్షించిందట. సినిమాపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ చిత్రానికి 'అసాధారణమైన స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం' ఉందని చెప్పారు. మహరాణి నూర్ జహాన్‌గా నటించిన మృణాళ్ ఠాకూర్ చిత్రానికే హైలెట్‌గా నిలిచిందన్నారు. ఆ పాత్రను ఆమె చేసినట్లుగా మరే ఇతర నటి చేయలేదని చెప్పారు.

ఈ చిత్రం నాకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. హను రాఘవపూడికి అభినందనలు. చిత్రంలో నటీనటులందరూ అద్భుతంగా నటించారని, అయితే మృణాల్ నటన తనకు ప్రత్యేకంగా నిలుస్తుందని కంగన అన్నారు. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక చాలా అద్భుతంగా ఉందని ఆమె అన్నారు. "నటీనటులందరూ అద్భుతంగా నటించారు కానీ నాకు మృణాల్ ఠాకూర్ నటన బాగా నచ్చింది.

నిగ్రహించబడిన భావోద్వేగాలు, ఆమె ప్రవర్తన ఆమెకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. మరే నటిని ఆ పాత్రలో ఊహించుకోలేము. ఎంత అద్భుతమైన కాస్టింగ్. నిజంగా రాణిలానే ఉంది. జిందాబాద్ ఠాకూర్ సాబ్ (మేడమ్), ఇక్కడ మీ పాలన ప్రారంభమవుతుంది...' ఆమె తన నోట్‌తో పాటు రాణి ఎమోజీని కూడా షేర్ చేసింది.

సీతా రామం టీమ్‌కి ఇటీవల పోలాండ్ నుండి ఒక అభిమాని 'మోనికా' సినిమాపై ప్రేమను కురిపిస్తూ ఓ సుదీర్ఘ లేఖ రాశారు. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ఈ లేఖపై ప్రతిస్పందించారు. మోనికా తన బయోలో '2006 నుండి భారతీయ సినిమాకి, సంగీతానికి అభిమానిని' అని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ లేఖపై దుల్కర్ స్పందిస్తూ, "ఇది చాలా అందంగా వ్రాయబడింది. సినిమా గురించి మీరు వ్రాసిన లేఖ మీ ప్రతిభకు అద్దం పడుతోంది. చాలా సున్నిత అంశాలను కూడా చాలా చక్కగా విశ్లేషించారు. మీరు మాపై కురిపించిన ప్రేమకు కృత

జ్ఞతలు అని సమాధానం ఇచ్చారు దుల్కర్. మీరు ఇచ్చిన ఈ స్పూర్తితో మరిన్ని మంచి సినిమాల్లో నటించి మిమ్మల్ని అలరిస్తాము అని రాసుకొచ్చారు. మోనిక ట్వీట్‌కు నటి మృణాల్ స్పందిస్తూ, "నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను! మీరు ఖచ్చితంగా నా రోజును మరింత అందంగా మలిచారు" అని రాశారు.

Tags:    

Similar News