Premi Viswanath Jobs: నిరుద్యోగులకు వంటలక్క బంపర్ ఆఫర్..కానీ కండిషన్స్ అప్లయ్..!

Premi Viswanath Jobs: ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. తెలుగు టీవీ చానెళ్లను ఫాలో అయ్యే వారందరికీ ఈమె గురించి బాగా తెలిసే ఉంటుంది.;

Update: 2022-04-14 03:00 GMT

Premi Viswanath Jobs: ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. తెలుగు టీవీ చానెళ్లను ఫాలో అయ్యే వారందరికీ ఈమె గురించి బాగా తెలిసే ఉంటుంది. కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కగా ఫుల్ ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన అప్డేట్ లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా ఆమె తన ఫేస్‌బుక్ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. పలు ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. డ్రైవర్, అకౌంటెంట్ ఉద్యోగాలకి అభ్యర్థులు కావాలని తెలిపారు. డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి అన్ని రకాల ఫోర్ వీలర్స్ వాహనాలను నడిపడం వచ్చి ఉండాలని ప్రకటనలో తెలిపింది. ఇక అకౌంటెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి టాలీ వచ్చి ఉండాలని, రెండేళ్ళ అనుభవం తప్పనిసరి అని పేర్కొంది.

ఈ ఉద్యోగాలకి సెలక్ట్ అయిన వారు కొచ్చిలోని ఎర్నాకులంలో పనిచేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్ లింక్ షేర్ చేయలేదు వంటలక్క. దీంతో ఆసక్తి కలిగిన వారు తమ గురించి వివరాలను కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు. చూడాలి మరి వంటలక్క ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తుందో. 

Similar News