Karthikeya: ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు..
Karthikeya: ‘ప్రేమతో మీ కార్తిక్’ సినిమాతో పరిచయమయిన కార్తికేయ.. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి చాలాకాలమే పట్టింది.;
Karthikeya (tv5news.in)
Karthikeya: 'ప్రేమతో మీ కార్తిక్' సినిమాతో హీరోగా పరిచయమయిన కార్తికేయ.. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి చాలాకాలమే పట్టింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఎక్స్ 100'.. కార్తికేయ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అప్పటినుండి తాను ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తాను హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాతే తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని.. తనకు తాను చేసుకున్న ప్రామిస్‌ను ఇప్పటికి నెరవేర్చుకున్నాడు.
గత రెండు సంవత్సరాలలో ఎంతోమంది టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లిపీటలెక్కారు. నితిన్, రానా లాంటి ఎంతోమంది హీరోలు లాక్‌డౌన్ సమయంలోనే పెళ్లిళ్లు చేసేసుకున్నారు. తాజాగా మరో యంగ్ హీరో కార్తికేయ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. బీటెక్ నుండి ప్రేమిస్తున్న లోహిత రెడ్డిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.
సినీ పెద్దల సమక్షంలో కార్తికేయ, లోహిత ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి చిరంజీవి, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి లాంటి సీనియర్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరితో పాటు తన సినీ కెరీర్‌కు పిల్లర్లుగా నిలిచిన అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కూడా వీరి పెళ్లిలో సందడి చేశారు. పెళ్లి పీటల మీద నవ్వుతూ సరదాగా ఉన్న కార్తికేయ, లోహిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.