కార్తీ మూవీ కూడా ఆగిపోయింది. రేపు విడుదల కాబోతున్న ఈ మూవీ విడుదలను ఆపేయాలని మద్రాస్ హై కోర్ట్ ఆదేశించింది. నిర్మాత కేఇ జ్ఞానవేల్ రాజా 21.7 కోట్లు ముందుగా చెల్లించాలని.. ఆ తర్వాతే విడుదల చేయాలని కోర్ట్ ఆర్డర్ పంపింది. అయితే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి గత ఆరు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు కేఇ జ్ఞానవేల్ రాజా. ఫైనల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న టైమ్ లో మాత్రం ఆపడం మాత్రం కాకతాళీయం మాత్రం కాదు. ఇంత మొత్తం అతను చెల్లించాల్సి రావడం మాత్రం ఇప్పుడు అసలు సమస్య.
ఈ మొత్తం చెల్లించాల్సిన తర్వాతే రిలీజ్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది కోర్ట్. మరి ఇంత తక్కువ టైమ్ లో కేఇ జ్ఞానవేల్ రాజా ఆ మొత్తం సర్దుబాటు చేయడం అనేది దాదాపు అసాధ్యం అనుకోవచ్చు. ఒవకేళ మధ్యవర్తిత్వం ద్వారా సంప్రదింపులు జరిపితే మాత్రం కొంత వరకు వెసులుబాటు కలగొచ్చు. అలా కుదరదు అనుకుంటే మాత్రం రిలీజ్ ఆపాల్సిందే. మొత్తంగా ఈ యేడాది తమిళ్ మూవీస్ కు సంబంధించి పెద్ద ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కార్తీ లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా ఆగిపోవడం మాత్రం పెద్ద విషయమే. మరి ఇంత తక్కువ టైమ్ లో రిలీజ్ చేయడం సాధ్యమా కాదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.