తమిళ్ లో స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు సూర్య అండ్ కార్తీ. అందులో కార్తీ కాస్త ఎక్కువగా తెలుగు ఆడియన్స్ కు నచ్చే సినిమాలు చేస్తున్నాడు. ఈ రేస్ లో సూర్య కాస్త వెనకబడ్డాడు. అయితే అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. సన్నాఫ్ విశ్వనాథం అనే టైటిల్ తో రూపొందుతుందీ మూవీ. వెంకీ అట్లూరి దర్శకుడు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ మూవీ రూపొందుతోంది. అయితే ఇదే బ్యానర్ లో కార్తీ కూడా ఓ మూవీ చేయబోతున్నాడు.
ఆల్రెడీ కార్తీ డైరెక్ట్ తెలుగు మూవీగా ఊపిరి చేశాడు. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఆ తర్వాత మళ్లీ కార్తీ డైరెక్ట్ మూవీ చేయలేదు. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఈ చిత్రానికి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకుడు. ఈ దర్శకుడు ఆల్రెడీ సితారలోనే మ్యాడ్ తో ఆకట్టుకున్నాడు. అదే బ్యానర్ లోనే ఈ మూవీ చేయబోతున్నాడు. ముందుగా ఈ ప్లేస్ లో మరో హీరో వినిపించింది. బట్ కార్తీనే ఫైనల్ అయ్యాడు. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా నటించబోతోంది. ఈ కాంబినేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు.