Kayadu Lohar : ద ప్యారడైజ్ మూవీలో సుబ్బుగా కయాడు లోహర్

Update: 2026-04-11 07:08 GMT

కయాడు లోహర్.. ఈ మధ్యకాలంలో డ్రాగన్ మూవీతో షైన్ అయింది. అంతకు ముందు తెలుగులో ఓ మూవీ చేసినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. బట్ డ్రాగన్ లాంటి తమిళ్ డబ్బింగ్ మూవీతో అమ్మడు బాగా ఫేమ్ అయింది. తను మెయిన్ హీరోయిన్ కూడా కాదు. అయినా తన గ్లామర్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మళయాలంలో ఆమె చేతిలో ఏకంగా అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. అది డ్రాగన్ వల్ల వచ్చిన ఆఫర్స్ అంటే అతిశయోక్తి కాదు. అలాగే తను నటనతో కూడా ఫర్వాలేదు అనిపించుకుంది. ఆ కారణంగా ఇన్ని మూవీస్ చేతిలో ఉన్నాయి. అన్నట్టు తన బర్త్ డే ఇవాళ. ఆ బర్త్ డే స్పెషల్ గా నాని హీరోగా నటిస్తోన్న ద ప్యారడైజ్ మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. డ్రాగన్ తర్వాత వెంటనే తెలుగులో ఫంకీ మూవీ చేసింది. కానీ ఈ మూవీ దారుణంగా పోయింది. అయితేనే నాని నుంచి ఆఫర్ అంటే పెద్ద విషయమే కదా.

ద ప్యారడైజ్ లో ఆమె సుబ్బు అనే పాత్రలో నటించబోతోందని మూవీ టీమ్ చెప్పింది. ఆ పాత్రలో ఆమె ఓ రిచ్ అమ్మాయిగా నటిస్తోందని అర్థం అవుతోంది. ఓ చిన్న బస్తీలో ఆమె మంచి లుక్ తో సైకిల్ పై వెళుతున్న లుక్ ఇది. చాలా బావుంది. ఆ పాత్రకు తగ్గ లుక్ లా ఉంది అనిపిస్తోంది. పైగా ఇది పీరియాడికల్ డ్రామా కాబట్టి ఈ లుక్ సెట్ అయింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఆగస్ట్ 21న ఈ మూవీ విడుదల కాబోతోంది. మొత్తంగా ద ప్యారడైజ్ నుంచి విడుదల చేసిన కయాడు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం చాలా బావుంది.

 

Tags:    

Similar News