Chiranjeevi : మెగాస్టార్ ఆ మూవీని లైట్ తీసుకున్నాడా..?

Update: 2026-04-10 12:23 GMT

మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతితో మన శంకరవరప్రసాద్ గారుతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత వరుసగా మూవీస్ లైనప్ లో ఉన్నాయి. వీటిలో వాల్తేర్ వీరయ్యతో బిగ్ హిట్ అందించిన బాబీతో ఇమ్మీడియొట్ గా మూవీ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండబోతోంది. ఈ రెండూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్స్. అయితే వీటికంటే ముందు రావాల్సిన మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురించి పెద్దగా అప్డేట్స్ అంటూ ఏం రావడం లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది. త్రిష, అషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించారు. ఓ రకంగా ఈ మూవీ షూటింగ్ అంతా అయిపోయింది. కానీ విఎఫ్ఎక్స్ మాత్రం ఓ పట్టాన తేలడం లేదు. ఇప్పటికే రెండేళ్లు టైమ్ తీసుకుందీ మూవీ. అయినా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. చాలా వరకూ రీ షూట్స్ కూడా చేశారు. అయినా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం క్లియర్ గా రావడం లేదు.

విశ్వంభర విషయంలో మెగాస్టార్ ఎంత చేయాలో అంతకు మించి చేశాడు. అయినా ఈ మూవీ సరిగ్గా రావడం లేదు. దీంతో అతను లైట్ తీసుకున్నాడు అని అర్థం అయింది. అందుకే అతని తర్వాతి సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. విశ్వంభర ఎప్పుడు వస్తుందో తెలియదు.కాబట్టి అతనూ ఈ మూవీ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ మూవీ విఎఫ్ఎక్స్ పై ముందుగా క్లారిటీ లేకుండా చిత్రీకరణ చేయడం వల్లే ఇలా జరుగుతోంది అనేది అందరికీ తెలుసు. ఆ కారణంగానే ఆ విషయంలో స్పష్టత లేని కారణంగానే ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడుతోంది. ఇప్పటికైతే అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. అందుకే మెగాస్టార్ ఈ మూవీని పూర్తిగా లైట్ తీసుకున్నాడని మాత్రం అర్థం అవుతోంది. ఒకవేళ అంతా సెట్ అయితే అప్పుడు ఆయన ప్రమోషన్స్ వరకు వెళతాడు. లేదంటే అంతే సంగతులు. 

Tags:    

Similar News