టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్. వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ తేరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ లో సమంత నటించింది. ఆమెనే ఈ సినిమాకు నన్ను రిఫర్ చేసింది. షూటింగ్ సమయంలో కూడా చాలా సపోర్ట్ చేసింది సమంత. అందుకే ఆమెకు నా కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.