సినిమా అంటేనే అంత. ఏది ఎక్స్ పెక్ట్ చేస్తామో అది జరొగొచ్చు.. జరగక పోవచ్చు. కొన్నిసార్లు చాలా ఎక్కువగా నమ్మేసి.. ఇంతకు ముందెప్పుడూ లేనంత ఎఫర్ట్ పెట్టేస్తారు. బట్ రిజల్ట్ మాత్రం తేడా కొడుతుంది. ఇంకా చెబితే అస్సలు ఊహించనంత భయంకరమైన తేడా కొడుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి అదే అంటున్నారు జనమంతా. పాపం అమ్మడు ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ ధావణ్ సరసన బేబీ జాన్ మూవీ చేసింది. ఇది ఆల్రెడీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన తెరికి రీమేక్. సో.. హిట్టు గ్యారెంటీ అనుకుందేమో.. ఇప్పటి వరకూ కనిపించనంత హాట్ గా బేబీ జాన్ లో డ్యాన్సులు కట్టింది. అమ్మడి ఎక్స్ పోజింగ్ చూసి సౌత్ జనాలు.. వార్నీ.. ఇన్నాళ్లూ ఇక్కడ ఎంత పద్ధతిగా ఉంది.. అక్కడికి వెళ్లగానే అంత ఓపెన్ అయిపోయిందీ అని బుగ్గలు నొక్కుకుని మరీ ఆశ్చర్యాలు పోయారు.
ఇక ఈ మూవీ పూర్తయిన తర్వాత తన పెళ్లి జరిగింది. వెంటనే హనీమూన్ అనుకున్నారు. బట్.. బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం ఈ మహానటి హనీమూన్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంది. బాలీవుడ్ కు బాగా నచ్చేలా పెళ్లై వారం కూడా కాకుండానే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇవన్నీ ఎందుకు చేసిందీ అంటే బేబీ జాన్ తనకు బాలీవుడ్ లో కెరీర్ ఇస్తుంది అని కీర్తి బలంగా నమ్మడం వల్లే అనేది అసలు పాయింట్. బట్ బేబీజాన్ కీర్తి నమ్మకాన్ని నిలబెట్టలేదు. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడి ఆశలు అడియాశలయ్యాయి.
ఇదే మూవీతో నిర్మాతగా బాలీవుడ్ లో తొలి ప్రయత్నం చేసిన ఈ మూవీ ఒరిజినల్ డైరెక్టర్ అట్లీకి సైతం తీవ్ర నిరాశ తప్పలేదు. సో.. హిట్టు మూవీలన్నీ రీమేక్ ల్లోనూ హిట్టు మనిపించుకోవు. ప్రతి ప్రాంతం ఆడియన్స్ కూ డిఫరెంట్ టేస్ట్ లుఉంటాయి. ఆ టేస్ట్ లు దాటి యూనిక్ గా ఉంటేనే కనెక్ట్ అవుతుంది. లేదంటే బేబీ జాన్ అవుతుంది.