Keerthy Suresh: కీర్తి సురేశ్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై అలాంటి కథలకు దూరం..
Keerthy Suresh: ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలను అందరు హీరోయిన్లు చేయలేరు.;
Keerthy Suresh (tv5news.in)
Keerthy Suresh: ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలను అందరు హీరోయిన్లు చేయలేరు. హీరో లేకుండా సినిమాపై తమ పూర్తి బాధ్యత తీసుకొని.. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదు. అయినా కూడా కొందరు నటీమణులకు అందులో ఫుల్ మార్కులు పడ్డాయి. అందులో ఒకరే కీర్తి సురేశ్. కానీ కీర్తి ఇకపై అలాంటి సినిమాలు చేయనని నిర్ణయించుకుందట.
కీర్తి కెరీర్ మొదటి నుండి సాఫీగానే సాగింది. తను నటించిన ప్రతీ సినిమా లాభాల బాటలోనే నడిచింది. కానీ తన కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పిన చిత్రం మహానటి. అలనాటి నటి సావిత్రమ్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కీర్తి సినీ కెరీర్‌నే మార్చేసింది. అలాంటి పాత్రలకు కీర్తి మాత్రమే నప్పుతుంది అన్న నమ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిగించింది. అందుకే మహానటి తర్వాత కీర్తికి వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథలే ఎదురయ్యాయి.
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా ఒప్పుకోవడం మొదలుపెట్టింది కీర్తి సురేశ్. ఆ క్రమంలోనే మిస్ ఇండియా, పెంగ్విన్ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు తనకు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. అదే సమయంలో తాను నటించిన చాలావరకు కమర్షియల్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించాయి. అందుకే కీర్తి ఓ నిర్ణయం తీసుకుందట.
కమర్షియల్ సినిమాలే తనకు ఎక్కువ సక్కెస్‌ను అందిస్తున్నాయి కాబట్టి ఇకపై తన పూర్తి ఫోకస్ వాటిపైనే పెట్టాలి అనుకంటుందట కీర్తి సురేశ్. అందుకే కేవలం కమర్షియల్ కథలను మాత్రమే వినాలనుకుంటుందని సమాచారం. ఇప్పటికే కీర్తి.. మహేశ్ బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై కూడా కొంతకాలం పాటు కీర్తిని కేవలం కమర్షియల్ సినిమాల్లోనే చూడబోతున్నాం అన్నమాట.