Chinni Trailer: సైలెంట్‌గా కనిపిస్తూ వైలెంట్‌గా మర్డర్స్.. 'చిన్ని' ట్రైలర్ అదుర్స్..!
Chinni Trailer: గ్లామర్ పాత్రలతో పాటుగా, కథలో బలమున్న ‘మహానటి’ వంటి పాత్రలతో నటించి మెప్పించిన నటి కీర్తి సురేష్;
Chinni Trailer: గ్లామర్ పాత్రలతో పాటుగా, కథలో బలమున్న 'మహానటి' వంటి పాత్రలతో నటించి మెప్పించిన నటి కీర్తి సురేష్ మళ్ళీ 'చిన్ని' అనే విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపొయింది. అరుణ్ మథేశ్వరం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సెల్వ రాఘవన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ని చూస్తుంటే రివేంజ్ కథ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కినట్టుగా తెలుస్తోంది.. సెల్వారాఘవన్ ఇంట్రడక్షన్‌తో మొదలైన ట్రైలర్ తన పేరు, ఊరు, చేసిన హత్యల గురించి కానిస్టేబుల్‌కు వివరణ ఇస్తాడు.
అదే విధంగా కీర్తి సురేష్ కూడా తన, పేరును చెబుతుంది. ఇందులో వీరిద్దరూ కలిసి 24 హత్యలు చేసినట్టుగా చెబుతారు.. అయితే వీరిద్దరూ ఆ హత్యలుఎందుకు చేశారు. దానివేనుకున్న బలమైన కారణం ఏంటి అన్నది సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో కీర్తి సురేష్, సెల్వా రాఘవన్ డీ గ్లామరైజ్ పాత్రలో అన్నా చెల్లెలుగా నటించారు. మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.