Keerthy Suresh : భర్త కోసం కీర్తి షాకింగ్ డెసిషన్

Update: 2024-12-25 05:15 GMT

సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి మిత్రుడు ప్రముఖ వ్యాపారవేత్త ఆంటోనీ తాటిల్ తో కలిసి ఆమె ఏడడుగులు వేశారు. ఇటీవలే ఈ వీరి పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది. చాలా గోప్యంగా జరిగిన పెళ్లికి చాలా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపధ్యంలోనే తన భర్త కోసం షాకింగ్ డెసిషన్ తీసుకుందట కీర్తి. తన భర్త కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. పూర్తిగా పర్సనల్ లైఫ్‌ను భర్తతో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఇద్దరి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Tags:    

Similar News