హరిహర వీరమల్లు నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మార్చి 28న విడుదల కాబోతోన్న ఈ చిత్రం నుంచి ఆ మధ్య పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి అనే పాట విడుదల చేశారు. అది ఆకట్టుకుంది. ఈ నెల 24న మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం అని ప్రకటించారు. ఆ ప్రోమో రిలీజ్ అయింది. వినగానే ఆకట్టుకునేలా ఉంది కీరవాణి ట్యూన్. ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ ప్రస్తుతం దర్శకుడీ చిత్రానికి. అంతకు ముందు కొన్ని షెడ్యూల్స్ క్రిష్ డైరెక్ట్ చేశాడు.
ఇక ఈ పాటను చంద్రబోస్ రాశాడు. మంగ్లీ పాడిన వెర్షన్ మాత్రం ప్రోమోలో కనిపిస్తోంది. ‘కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెణకులతో కొలిమిలాంటి మగటిమితో.. సర సర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడు..’ అనే సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ పాట అనౌన్స్ మెంట్ టైమ్ లో నిధి అగర్వాల్ సాంగ్ అనుకున్నారు. బట్ ఈ ప్రోమోలో చూస్తే అనసూయ, పూజిత పొన్నాడ కనిపిస్తున్నారు. అసలు నిధి అగర్వాల్ ఎంట్రీయే లేదు. మరి అది వేరే పాటా లేక ఇందులోనే పూర్తి పాటలో కనిపిస్తుందేమో తెలియదు కానీ.. ఈ ప్రోమో మాత్రం పవన్ ఫ్యాన్స్ లో కొత్త ఊపు తెచ్చేలానే ఉంది.