Vijay 66 : గ్రాండ్‌గా మొదలైన విజయ్, వంశీ పైడిపల్లి మూవీ..!
Vijay 66 : తమిళ స్టార్ హీరో విజయ్ 66వ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం మొదలైంది.;
Vijay 66 : తమిళ స్టార్ హీరో విజయ్ 66వ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం మొదలైంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. ఈ పూజా కార్యక్రమంలో విజయ్, రష్మిక మందన్న, తమన్, వంశీ పైడిపల్లి పాల్గొన్నారు. ఇక విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్ విడుదల సిద్దంగా ఉంది.. ఏప్రిల్ 13న భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది.