Konda Polam Twitter Review: క్రిష్ డైరెక్షన్.. వైష్ణవ్ యాక్షన్ సూపర్.. 'కొండపొలం' ట్విట్టర్ రివ్యూ
Konda Polam Twitter Review: గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ సినిమా కొండ కోనల్లో ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో రొమాన్స్ ..;
Konda Polam Twitter Review: 'ఉప్పెన' తరువాత భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన మరో సినిమా 'కొండపొలం'. మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇక ఈ రెండో సినిమాలో కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు.
గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ సినిమా కొండ కోనల్లో ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో రొమాన్స్ చేయిస్తూనే ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్ చేశాడు దర్శకుడు క్రిష్. హీరో ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన తీరు ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.
ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సన్నపు రెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన నవలను ప్రధానాంశంగా తీసుకున్నారు దర్శకుడు క్రిష్.
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌తో పాటు మరికొన్ని ప్రధాన పాత్రల్లో సాయిచంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, ఆంథోని, రవిప్రకాష్, మహేష్ విట్టా, రాచ రవి మరియు ఆనంద్ విహారి నటీనటులు నటించారు.
ఇప్పటికే ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన 'కొండపొలం' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కొనియాడారు. నెటిజన్లు కూడా ట్విట్టర్ ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ నటన సూపర్బ్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.