బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడైన హృతిక్ రోషన్ ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ క్రిష్. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే మూడు భాగాలుగా వచ్చి విజయం సాధించింది. అందుకే దీనికి కొనసాగింపుగా క్రిష్ -4 కూడా చేయబోతున్నారు. ఎప్పుడో రావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాగా ఆలస్యం అయింది.ప్రస్తుతం హృతిక్ వార్ 2తో బిజీగా ఉన్నాడు. వార్ 2 ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఆ తర్వాత క్రిష్ 4 ప్రాజెక్ట్ వైపు వెళతాడు హృతిక్. ఇప్పటికే రాకేష్ రోషన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశాడు. దీంతో సినిమాకు సంబంధించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా వినిపిస్తోన్న రూమర్ ఏంటంటే.. క్రిష్ 4లో హృతిక్ రోషన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఫైనల్ అయింది అని. బట్ ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదుట.
ప్రస్తుతానికి అది జస్ట్ రూమర్ మాత్రమే. వీళ్లు అసలు హీరోయిన్ గా ఇంకెవరినీ అప్రోచ్ కాలేదు అని టాక్. సో.. రష్మిక హీరోయిన్ అనేది ఇప్పటికైతే పూర్తిగా బేస్ లెస్ న్యూస్. ఒకవేళ తర్వాత నిజంగానే తను ఆ ప్రాజెక్ట్ లో భాగం అయితే అది అప్పటి మేటర్.
ఇక ఈ ఫ్రాంఛైజీలో గత మూడు భాగాల్లో నటించిన ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా, రేఖ కూడా కనిపిస్తారు అనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఆ ముగ్గురూ లీడ్ లో కాకపోయినా కేమియోస్ లో అయినా కనిపిస్తారనేది నిజమే అంటోంది బాలీవుడ్. ఆ మూడు భాగాల్లో హృతిక్ సూపర్ మేన్ తరహా పాత్రలో కనిపించాడు. ఈ సారి టైమ్ ట్రావెల్ జానర్ లో ఉంటుందట. హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. అదీ మేటర్.