ఇవాళా రేపు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ప్రాపర్ ప్రమోషన్స్ లేకపోతే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రమోషన్స్ లో సందడి కనిపించాలి. అది కూడా రొటీన్ గా ఉండకూడదు. ఏదో ఒక వైవిధ్యం చూపించాలి. అలా చూపిస్తేనే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. మరీ పెద్ద హీరోలైతే ఓపెనింగ్స్ కు ఢోకా లేదు కానీ.. మీడియం రేంజ్ హీరో అంటే ఖచ్చితంగా డిఫరెంట్ ప్రమోషన్స్ తో అప్రోచ్ కావాల్సిందే. బట్ రిలీజ్ కు కేవలం ఒక్క వారమే ఉన్న కుబేర మూవీ టీమ్ నుంచి పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. ట్రైలర్ లాంచింగ్ పెట్టుకున్నారు. కానీ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ విషాదం వల్ల ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లానూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, క్యూ అండ్ ఏ( మీడియా మీట్ లో ప్రశ్నలు - సమాధానాలు) చాలా కామన్ అయిపోయాయి. అందువల్ల ఇవి సినిమాపై హైప్ తెస్తాయి అనుకోలేం.
ఇక పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా చాలా కాస్త రొటీన్ గానే కనిపిస్తున్నాయి. అంతకు మించి ఇంకేదైనా వైవిధ్యం చూపించాలి. బట్ శేఖర్ కమ్ముల కేవలం తన సినిమాలే మాట్లాడతాయి అనే టైప్. కానీ అతను 2021లో లవ్ స్టోరీ అనే మూవీతో వచ్చాడు. కుబేర 2025.. ఇంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఫిల్ కావాలంటే శేఖర్ కూడా రంగంలోకి దిగాల్సిందే. క్రియేటివ్ ప్రమోషన్స్ అనేవి ఇప్పుడు సినిమా ఆరంభం నుంచే కనిపిస్తున్నాయి. అందుకు రీసెంట్ గా స్టార్ట్ అయిన చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఒక ఉదాహరణ. హీరోయిన్ ఎంట్రీని కూడా వాళ్లు ప్రమోషన్స్ కు వాడేశారు. తర్వాత అల్లు అర్జున్, అట్లీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా ఆరంభం నుంచే ప్రమోట్ చేస్తున్నారు. సో.. కంటెంట్ ఎంత బలంగా ఉన్నా.. అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా ఉంటేనే ఓపెనింగ్స్ మరింత పెరుగుతాయి.