Kushi Movie: 'ఖుషి' సినిమాకు 21 ఏళ్లు.. భూమిక స్పెషల్ పోస్ట్ వైరల్..
Kushi Movie: భూమిక.. ఒకప్పుడు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన హీరోయిన్.;
Kushi Movie: పవన్ కళ్యాణ్‌కు వపర్ స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో 'ఖుషి' కూడా ఒకటి. ఇందులో పవన్ మ్యానరిజం, స్టైల్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవన్‌ను ఓ స్టార్ హీరోగా మార్చిన ఈ సినిమా వచ్చి అప్పుడే 21 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్‌గా నటించిన భూమిక ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది.
భూమిక.. ఒకప్పుడు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన హీరోయిన్. దాదాపు ఐదేళ్ల పాటు టాలీవుడ్‌లో భూమిక హవా నడిచింది. తను పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఆ తర్వాత తానే స్వయంగా సినిమాల్లో నుండి తప్పుకుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన పోస్టులు పెట్టే భూమిక.. ఖుషికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది.
ఖుషి పోస్టర్‌ను షేర్ చేస్తూ.. 'ఖుషికి 21 ఏళ్లు. ఎన్నో జ్ఞాపకాలతో కూడిన అద్భుతమైన ప్రయాణం. ఈ సినిమా నన్ను భూమిక నుండి మధుగా మార్చేసింది. నా సినీ కెరీర్‌లోనే చాలా ఇష్టపడే క్యారెక్టర్ ఇది.' అంటూ పోస్ట్ పెట్టింది భూమిక. అంతే కాకుండా ఈ పోస్ట్‌లో మూవీ యూనిట్‌ను కూడా ట్యాగ్ చేసింది. ఇక ప్రస్తుతం భూమిక తెలుగు సినిమాల్లో పలు కీలక పాత్రలు చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా గడిపేస్తోంది.
21 YEARS OF KUSHI . Full of Memories & an incredible journey The movie that made Bhumika -- Madhu 💕 one of the most adored , loved characters of my Film career . 🙏 A. M Ratnam Sir ,Dir S.J Suryah @IamSjsuryah Pawan Kalyan Garu - @PawanKalyan &Brinda master @BrindaPrasad1 pic.twitter.com/uaD5XSj9W3
— Bhumika Chawla — Just B (@bhumikachawlat) April 26, 2022