Chiranjeevi : మెగాస్టార్, బాబీ.. ఓ భారీ సినిమా

Update: 2025-08-01 13:46 GMT

మెగాస్టార్ చిరంజీవి వీలైనంత ఎక్కువగా సినిమాలే చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏజ్ గురించి పట్టించుకోకుండా దూసుకుపోతున్నాడు. విశ్వంభరను రీసెంట్ గానే పూర్తి చేశాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి విడుదల చేయబోతున్నారీ చిత్రాన్ని. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుంది అనుకున్నారు. బట్ దానికి ముందే మరో ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది. వాల్తేర్ వీరయ్యతో మనకు వింటేజ్ మెగాస్టార్ ను చూపించిన బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని ఈ మధ్యే సినిమా నిర్మాణంలోకి వచ్చిన కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మింబోతుంది.

కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్లు ప్రస్తుతం విజయ్ తో జన నాయగన్, యశ్ హీరోగా టాక్సిక్, కార్తీతో ఖైదీ 2 చిత్రాలను నిర్మిస్తోంది. అటు మళయాలంలోనూ అడుగుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. అది మెగాస్టార్ మూవీ కావడంతో ఆ బ్యానర్ క్రేజ్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ఇక ఈ చిత్రం భారీ స్థాయిలో ఉండబోతోందట. ఆ బ్యానర్ లో వస్తోన్న సినిమాలన్నీ భారీగానే ఉంటుందున్నాయి. కాంబినేషన్ క్రేజ్ కూడా చూసుకుంటున్నారు. అందుకే వాల్తేర్ వీరయ్య కాంబోను ఎంచుకున్నారు అనుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని ఇవాళ(శుక్రవారం) బాబీ బర్త్ డే స్పెషల్ గా ప్రకటించడం విశేషం. సో.. ఈ సారి వాల్తేర్ వీరయ్యను మించిన ఎంటర్టైనర్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో. 

Tags:    

Similar News