Lata Mangeshkar: గాన కోకిలపై గతంలో విష ప్రయోగం.. మూడు రోజులు మృత్యువుతో పోరాడి..

Lata Mangeshkar: డాక్టర్.. లతా మంగేష్కర్‌ను పరీక్షించిన తర్వాత ఆమెకు ఎవరో స్లా పాయిజన్ ఇచ్చారని చెప్పారట.

Update: 2022-02-06 15:28 GMT

Lata Mangeshkar (tv5news.in)

Lata Mangeshkar: గాన కోకిల, నైటింగేల్ లతా మంగేష్కర్ ఇక లేరు అని విషయాన్ని జీర్ణించుకోవడం ఆమె అభిమానులకు చాలా కష్టంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుండి ఆమె పాటలతో, మాటలతో అందరినీ అలరించిన లతా.. అంత్యక్రియల్లో అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఇన్నాళ్ల తర్వాత లతా మంగేష్కర్ జీవితంలో జరిగిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

లతా మంగేష్కర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రముఖ రైటర్ పద్మా సచ్‌దేవ్.. లతా జీవితం గురించి తన పుస్తకంలో తెలిపారు. అందులో చాలామందికి తెలియని ఓ విషయం గురించి పద్మా బయటపెట్టారు. 1963లో లతా మంగేష్కర్‌పై విష ప్రయోగం జరిగిందట. తీవ్రమైన కడుపు నొప్పితో వాంతులు చేసుకుంటూ.. మూడురోజులు మంచంపైనే గడిపిందట లతా.

డాక్టర్.. లతా మంగేష్కర్‌ను పరీక్షించిన తర్వాత ఆమెకు ఎవరో స్లా పాయిజన్ ఇచ్చారని చెప్పారట. మూడు రోజుల తర్వాత ఆమె కోలుకున్నా కూడా విషప్రయోగం వల్ల నీరసించిపోయారట. ఆ మూడు రోజులు తర్వాత కూడా ఆమె చాలావరకు మంచానికే పరిమితమయ్యారట. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పూరీ.. లతా మంగేష్కర్‌కు ఎంతో చేయుతగా ఉండేవారని పుస్తకంలో పేర్కొన్నారు పద్మా సచ్‌దేవ్.

సుల్తాన్‌ పురీ ప్రతిరోజు సాయంత్రం లతా మంగేష్కర్ ఇంటికి వచ్చి ఆమెకు కంపెనీ ఇస్తూ నవ్వించేవారట. లతా తినే ప్రతీ వంటను ముందుగా ఆయన తిని చెక్ చేసి తర్వాత ఆమెకు పెట్టేవారని సుల్తా్న్ పూరీ గురించి పుస్తకంలో గొప్పగా వివరించారు పద్మా సచ్‌దేవ్. లతా కోలుకోవడంలో సుల్తాన్ పూరీ పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News