Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 50 వేలకు పైగా పాటల్లో కేవలం మూడు మాత్రమే తెలుగు..

Lata Mangeshkar Telugu Songs: 20 భాషల్లో 50 వేలకు పైగా పాటల పాడిన గానకోకిల లెజెండరీ.;

Update: 2022-02-06 09:56 GMT

Lata Mangeshkar (tv5news.in)

Lata Mangeshkar Telugu Songs: 20 భాషల్లో 50 వేలకు పైగా పాటల పాడిన గానకోకిల లెజెండరీ. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో ప్రేక్షకులను అలరించిన మెలోడీ క్వీన్.. నైటింగేల్. లతా మంగేష్కర్ గాత్రం అమృత ప్రవాహం. తన కెరీర్‌లో ఎక్కువగా హిందీ పాటలే పాడినా.. తెలుగు భాషలోను మూడు పాటలు పాడారు.

1955లో అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రి నటించిన సంతానం చిత్రంలో నిదురపోరా తమ్ముడా అనే పాటను తొలిసారిగా తెలుగులో పాడారు లతా మంగేష్కర్.

1965లో ఎన్టీఆర్, జమున నటించిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశా అనే గీతాన్ని ఆలపించారు.

ఇక చివరిసారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఆఖరిపోరాటం చిత్రంలోని తెల్లచీరకు పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి లతా మంగేష్కర్ పాడారు.

Tags:    

Similar News