Rajanikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై భార్య లత స్పందన..
Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఉన్నారు.;
Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే జనరల్ హెల్త్ చెకప్ కోసమే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆమె రజనీ అభిమానులను కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా, రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ గురువారం సాయింత్రం అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరడంపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.