తెలుగులో మూవీస్ పెద్దగా వర్కవుట్ కావడం లేదు అని ఇతర భాషలపై కన్నేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ క్రమంలో తమిళ్ లో స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే మూవీతో ఆకట్టుకున్నాడు. ఈ కథ తెలుగులో కొత్తదేం కాదు. బట్ తమిళ్ ఆడియన్స్ కు మాత్రం బాగా నచ్చింది. కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది.దిల్ రాజు నిర్మాత. అయితే ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా అది క్లియర్ చేశాడు వంశీ పైడిపల్లి. తన హిందీ మూవీకి లైన్ క్లియర్ చేశాడు.
ముందు నుంచీ వంశీ పైడిపల్లి.. సల్మాన్ ఖాన్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోందీ మూవీ. ఇప్పటికే కథ ఫైనల్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ కారణంగానే మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. బట్ ఇది కన్ఫార్మ్ అని చెప్పారు. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సో.. వంశీ ఇకపై తమిళ్ తర్వాత హిందీ మార్కెట్ పై కన్నేస్తాడన్నమాట. అయితే ఇది కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలా కాకుండా కాస్త యాక్షన్ కంటెంట్ తో కూడా నింపేయబోతున్నారని టాక్.