K.S.Sethumadhavan: కమల్ హాసన్‌ను మాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..

K.S.Sethumadhavan: ఇప్పటికే కరోనా వల్ల, అనారోగ్య వల్ల సినీ పరిశ్రమ ఎంతోమంది గొప్ప వ్యక్తులను కోల్పోయింది.

Update: 2021-12-24 07:45 GMT

K.S.Sethumadhavan: ఇప్పటికే కరోనా వల్ల, అనారోగ్య వల్ల సినీ పరిశ్రమ ఎంతోమంది గొప్ప వ్యక్తులను కోల్పోయింది. తాజాగా మరో సీనియర్ దర్శకుడు కూడా కన్నుమూసి సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు. ఆయనే కేఎస్ సేతుమాధవన్. శుక్రవారం ఉదయం ఆయన చెన్నైలోని నివాసంలో ఆఖరి శ్వాస విడిచారు. 90 ఏళ్ల సేతుమాధవన్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.

కేరళలోని పాలక్కడ్ జిల్లాలో జన్మించిన సేతుమాధవన్.. అలనాటి తమిళ దర్శకుడు కే రామనాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 1960లో విడుదలయిన 'వీరవిజయ' తమిళ చిత్రంతో సేతుమాధవన్ డైరెక్టర్‌గా మారారు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం విడుదలయిన తర్వాత కొంతకాలానికే తన మాతృభాష మలయాళంలో కూడా తెరంగేట్రం చేశారు.

'కన్ను్మ్ కారళుమ్' అనే మలయాళ చిత్రంతో కమల్ హాసన్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత సేతుమాధవన్ సొంతం. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలతో మాలీవుడ్ రూపురేఖలనే మార్చేశారు సేతుమాధవన్. ఆయన 60 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 10కి పైగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 1991లో విడుదలయిన 'వెనల్కినవుకల్' దర్శకుడిగా సేతుమాధవన్ ఆఖరి చిత్రం.

Tags:    

Similar News