Liger Movie: ఈ ఫోటో పోజ్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..!
Liger Movie: ఫారిన్లో లైగర్ టీమ్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Liger Movie: బాక్సింగ్‌కే కింగ్‌లాంటి మైక్ టైసన్ ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారంటేనే.. ఆ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అది కూడా పూరీ జగన్నాధ్ లాంటి డైనమిక్ డైరెక్టర్ డైరెక్షన్లో నటిస్తే.. ఊహకు కూడా అందని యాక్షన్ మన కళ్ల ముందు ఉండే ఛాన్స్ ఉంది. అందుకే 'లైగర్' పక్కా హిట్ అవుతుందని నమ్ముతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్లో జరుగుతోంది. అక్కడ టీమ్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లైగర్ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుంది లాంటి అప్డే్ట్స్ ఏవీ మూవీ టీమ్ ఇవ్వట్లేదు. కానీ ఎప్పటికప్పుడు సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ లాంటి వారిని క్యాస్ట్ చేసుకున్నారు. తాజాగా లైగర్ టీమ్ చేసిన ఫోటోషూట్‌లోని ఓ ఫోటో వెనుక పెద్ద కథే ఉంది.
మైక్ టైసన్.. లైగర్ భామ అనన్య పాండేతో చెవి కొరుకుతున్నట్టుగా ఫోజ్ పెట్టి ఫోటో తీసుకున్నారు. ఇది కేవలం ఫోజ్ మాత్రమే కాదు.. మైక్ టైసన్‌ను బాక్సింగ్ చరిత్రలో కింగ్‌గా నిలబెట్టిన ఒక ఐకానిక్ మూమెంట్. 1997లో జరిగిన ఒక బాక్సింగ్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థిగా ఉన్న హోలీఫీల్డ్పై దాడి చేసి తన చెవి కొరికేశారు.
ఈ ఘటన వల్ల మైక్ టైసన్ బాక్సి్ంగ్ లైసెన్స్ కూడా కొంతకాలం వరకు రద్దయ్యింది. అయినా కూడా స్ట్రాంగ్‌గా తిరిగొచ్చిన మైక్ టైసన్ బాక్సింగ్‌లో కింగ్‌గా నిలదొక్కుకున్నారు. ఇప్పుడు అదే పోజ్‌లో మైక్ టైసన్ అనన్య పాండేతో ఫోటో దిగడం.. తన ఫ్యాన్స్‌కు ఈ మూమెంట్‌ను గుర్తుచేస్తోంది.