Little Hearts Movie : లిటిల్ హార్ట్స్.. బిగ్ కలెక్షన్స్

Update: 2025-09-09 10:30 GMT

లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే.. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది. ప్రస్తుతం జనాలు థియేటర్స్ కు రావడం లేదు.. సినిమాలు చూడడం లేదు అనేది నిజం కాదని.. మంచి సినిమా వస్తే.. చూడడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని తెలియచెప్పింది ఈ సినిమా. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "లిటిల్ హార్ట్స్" సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది.

లిటిల్ హార్ట్స్ థియేటర్స్ లో రిలీజై ఊహించని విజయం సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాలో ఏముంది..? ఎందుకు ఇంత విజయం సాధించింది..? అనే జనాలే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో పాపులరైన మౌళిని టిక్కెట్లు కొని మరీ థియేటర్స్ లో చూస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేసింది. 4 రోజుల్లో 15.41 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

అందుకనే సినీ ప్రముఖులు కూడా లిటిల్ హార్ట్స్ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే... ఈ సినిమా ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇలా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగలేదు. దీనిని బట్టి ఈ సినిమాకి ఎంతలా ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే.. వరల్డ్ బిల్డింగ్.. పాన్ ఇండియా అంటూ ఏదేదో చేస్తున్న సినిమాలను చూసి జనాలకు బోర్ కొట్టింది. అందుకనే ప్రెష్ నెస్ ఉన్న సినిమాలు చూడాలి అనుకుంటున్నారు. ప్రేక్షకులు కోరుకునే ప్రెష్‌ నెస్ ఈ సినిమాలో ఉంది. అందుకనే ఇందులో స్టార్స్ ఎవరున్నారు అనేది చూడకుండా విరగబడి మరీ ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తున్నారు. జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ లో ఏ సినిమా రాలేదు. ఇప్పుడు అంత రేంజ్ గ్రాండ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది.. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది.

Tags:    

Similar News