Lokesh Kanagaraj : ఆగిపోయిన లోకేష్ కనకరాజ్ మూవీ

Update: 2025-03-10 09:15 GMT

ప్రస్తుతం సౌత్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకడుగా ఉన్న లోకేష్ కనకరాజ్ మూవీ ఆగిపోయింది అంటే అదో హాట్ టాపిక్ అవుతుంది కదా.. అది కూడా బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఆగిపోయిందీ అంటే అంతా అసలేం జరుగుతుందీ అని చూస్తారు కదా. చూస్తున్నారు. ఎందుకంటే నిజంగానే ఆయన చేస్తోన్న సినిమా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో హీరో రాఘవ లారెన్స్. మనోడూ డైరెక్టర్ గా అదరగొడుతున్నవాడే. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే అంతా ఆశ్చర్యంగా చూశారు. బట్ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్ లో పడిపోయింది.

లారెన్స్ హీరోగా ‘బెంజ్’ అనే టైటిల్ తో అనౌన్స్ అయిన సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు కాదు. ఈ చిత్రానికి అతను కథ అందించాడు. దర్శకుడు  భాగ్యరాజ్ కన్నన్. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం బడ్జెట్ ఇష్యూస్ వల్ల హోల్డ్ లో పడిపోయిందని తెలుస్తోంది. మామూలుగా లోకేష్ ప్రాజెక్ట్ లో ఉండగా బడ్జెట్ కారణంగా ఆగిపోవడం అనేది ఆశ్చర్యమే. అయితే బడ్జెట్ మాత్రమే కాకుండా.. దర్శకుడు, హీరో మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా ఓ కారణం అంటున్నారు. మరి అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ను అసలుకే వదిలేస్తారా లేక మరో దర్శకుడు లేక నిర్మాత ఎంటర్ అవుతారా అనేది చూడాలి.

మరోవైపు చూస్తే లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం నటిస్తోన్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అటు లారెన్స్ కూడా కాంచన ౪తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేలా ప్రయత్నిస్తున్నాడు లారెన్స్. 

Tags:    

Similar News