కొన్ని కథల విషయంలో హీరోల తీరు మారుతుంది. కథ బాలేకపోవడం.. ప్రొడక్షన్, బడ్జెట్, ఆర్టిస్ట్ లు, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.. దర్శకుడు తీరు విషయంలోనే వారి మార్పులు రకరకాలుగా కనిపిస్తుంటాయి. అలా సూర్యతో సినిమా అనుకున్న దాన్ని కాదు అని ఆమిర్ ఖాన్ తో చేయాలనుకున్నాడు దర్శకుడు. ఆపై ఆమిర్ ఖాన్ ను కూడా వదిలించుకున్నాడు.. ఇక అల్లు అర్జున్ తో అంటున్నాడు. అంటే ఇద్దరు టాప్ హీరోలు వదిలించుకున్నాడు అంటే కారణమేంటీ అని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా.. ఇంకెవరు.. లోకేష్ కనకరాజ్. ఈ దర్శకుడు ఆమిర్ ఖాన్ తో కూడా మూవీ వదిలించుకున్నాడు. కానీ ఆ కథ ను మాత్రం వదలడం లేదు. ఇక అల్లు అర్జున్ వెంట పడుతున్నాడు.
ఇంతకీ లోకేష్ కనకరాజ్ చేయాలనుకుంటోన్న మూవీ ఏంటీ అంటే.. ఇరుంబు కై మాయావి అనే టైటిల్ తో మూవీ. ఇరుంబు కై మాయావి కథను ముందుగా సూర్యతో చేయాలనుకున్నాడు. కానీ సెట్ కాలేదు. తర్వాత ఆమిర్ ఖాన్ తో చేయాలనుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది ఈ మూవీకి అనే టాక్ వచ్చింది. బట్ ఆమిర్ ఖాన్ తో మాత్రం ఈ ప్రాజెక్ట్ ను వదులుకున్నాడు. రీసెంట్ గా లోకేష్ తో మూవీ చేయాలనుకోవడం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు ఆమిర్. అదే ఆ కథను ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడట లోకేష్.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందనే టాక్ కూడా ఉంది. అలాంటి మూవీ కోసం అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకోవాలనుకోవడం లేదు. అదీ కాక అతను ఆల్రెడీ మళయాలంలో బసిల్ జోసెఫ్ తో కూడా మూవీ చేయాలనుకుంటున్నాడు అనే టాక్ కూడా ఉంది. మొత్తంగా లోకేష్ కనకరాజ్ నిరీక్షణకు తెర దించడం లేదు. మరి అల్లు అర్జున్ వరకు ఈ మూవీ వచ్చింది లేక.. వచ్చినట్టుగా ప్రచారం మాత్రం జరుగుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.